telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆకాకరతో ఆరోగ్యం…!

Tealse-Guard

ఆకాకర కాయలు లేదా బోడ కాకర అని పిలిచే వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఆకాకరను వండేప్పుడు.. వాటిపై ఉండే బొడిపెలను తీయకూడదు. ఎందుకంటే అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి. మరి ఆకాకరతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటంటే…

* ఆకాకరలోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
* వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.
* ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
* క్యాన్సర్ల బారిన పడకుండా ఆకాకర అడ్డుకుంటుంది.
* సాధారణ కాకరకాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.
* ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
* ఆకాకరలోని ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
* ఆకాకరలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
* ఆకాకర కాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

Related posts