సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం “మత్తు వదలరా”. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. కాగా ఈ చిత్ర పబ్లిసిటిని వినూత్నంగా ప్లాన్ చేశారు చిత్రం బృందం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వైవిధ్యమైన ప్రచారానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద శ్రీకారం చుట్టడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వైవిధ్యమైన పబ్లిసిటి క్యాంపెయిన్‌కి అందర్ని నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి “సాలా రేయ్ సాలా…” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.
next post