telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆమెను నా 309వ ప్రేయసిని చేసుకోవాలనుకుంటున్నాను… హీరోయిన్ పై సంజయ్ దత్ వ్యాఖ్యలు

Sanjay

కృతిసనన్, అర్జున్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పానిపట్’. ఇందులో సంజయ్ అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ అనే విలన్ పాత్రలో నటించారు. శుక్రవారం సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్… హిందీలో బాగా పాపులర్ అయిన ‘ది కపిల్ శర్మ’ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కపిల్.. సంజయ్‌ను ఓ ప్రశ్న అడిగాడు. ‘సర్ మీ 308 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?’ అని అడిగాడు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ.. ‘నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో లెక్కపెట్టలేదు. నాకు సినిమాలో కృతి సనన్ పెర్ఫామెన్స్ నచ్చింది. కాబట్టి ఆమెను నా 309వ ప్రేయసిని చేసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ఈ 300 మంది గర్ల్ ఫ్రెండ్స్ లెక్క ఏంటంటే… సంజయ్ దత్ జీవితాధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రంలో సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. అనుష్క శర్మ జర్నిలిస్ట్ పాత్రలో నటించారు. ‘ఇప్పటివరకు ఎంత మందితో పడుకున్నావ్’ అని అనుష్క శర్మ అడుగుతుంది. ఇందుకు సంజయ్ (రణ్‌బీర్) స్పందిస్తూ.. ‘300 మందితో.. కాదు 308 మందితో’ అంటాడు. దాంతో ఆయనకు అంతమందితో సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. చాలా మంది సంజయ్ దత్ క్యారెక్టర్‌పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు.

Related posts