telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్రదర్ తారక్… నీకు నేను ప్రామిస్ చేస్తున్నా ఆరోజు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను : చరణ్

RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈరోజు సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.. ‘విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..’ అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. చిత్రీకరణ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నామని తెలిపింది. ఇక చివరగా జూనీయర్ ఎన్టీఆర్ (భీమ్) లుక్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ని ఉద్దేశిస్తూ హీరో రామ్ చరణ్ స్పందించాడు.. ‘మై డియర్ బ్రదర్ తారక్.. నీకోసం చాలా రోజుల నుంచి ఒకటి ఇద్దామనుకుంటున్నా. అది ఇప్పుడు సిద్ధమవుతోంది. నీకు నేను ప్రామిస్ చేస్తున్నా. అక్టోబర్ 22కి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అంతకుముందు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్ ని మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related posts