telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

దేశంలో సన్నగిల్లుతున్న … కార్ల అమ్మకాలు ..

car sales declined in india

ఇండియాలో జూలై నెలలో పాసింజర్ కార్ల అమ్మకాలు 35.95 శాతం పడిపోయాయని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించింది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే, ఈ సంవత్సరం దాదాపు అన్ని వాహన కంపెనీల అమ్మకాలూ దిగజారాయని పేర్కొంది. మొత్తం వాహన అమ్మకాలు 18.71 శాతం పడిపోయాయని, కమర్షియల్ వాహన అమ్మకాలు 25.71 శాతం తగ్గాయని, మోటార్ సైకిల్ అమ్మకాలు 18.88 శాతం దిగజారాయని, స్కూటర్ల అమ్మకాలు 12.10 శాతం తగ్గాయని సియామ్ పేర్కొంది.

ఇండస్ట్రీ పెద్దలు గతవారంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి భారత వాహన పరిశ్రమలో కస్టమర్ల సెంటిమెంట్ ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వాహన పరిశ్రమలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు తగ్గాయని, సుంకాలను తగ్గించడం ద్వారా సెంటిమెంట్ ను పెంచాలని కోరారు. గడచిన మూడు నెలల వ్యవధిలో వాహన పరిశ్రమలో 2 లక్షల మంది ఉపాధిని కోల్పోయారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ వెల్లడించారు.

Related posts