telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మేము ఊహించిన దానికంటే ఎక్కువగా సైతాన్ సీరీస్ సక్సెస్ అయ్యింది !!!

డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా సైతాన్ వెబ్ సీరీస్ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ…
సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరకో సేవ్ టైగర్స్ కు కొనసాగింపు ఉంటుంది, అలాగే సైతాన్ కు కూడా కొనసాగింపు ఉంటుంది ఆలాగే త్వరలో తాను దర్శకత్వం వహించిన సిద్దా లోకం ఎలా ఉంది నాయనా సినిమా విడుదల కాబోతోందని తెలిపారు.

నటి సెల్లి మాట్లాడుతూ…
సైతాన్ సీరీస్ లో నాకు సావిత్రి పాత్రను ఇచ్చిన దర్శకుడు మహి గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తాని ఈ సీరీస్ ద్వారా ప్రూవ్ అయ్యింది. భవిషత్తులో మరిన్ని మంచి రోల్స్ లో మీ ముందుకు వస్తానని అన్నారు.

నటుడు రిషి మాట్లాడుతూ….
ముందుగా మా సైతాన్ వెబ్ సీరీస్ ను ఆధరిస్తున్న అందరికి కృతజ్ఞతలు. బాలి అనే రోల్ లో నాకు నటించడానికి స్కోప్ ఉంది, అదే విధంగా ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకులు మహి వి రాఘవ్ గారు. సైతాన్ లో అందరూ బాగా నటించారు, టెక్నీకల్ గా కూడా సీరీస్ బాగుందని అందరూ అంటున్నారు. సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ లో నటించానన్న సంతృప్తి ఉందని తెలిపారు.

నటి దేవియాని మాట్లాడుతూ….
సేవ్ టైగర్స్ తరువాత సైతాన్ సీరీస్ చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది, రెండు సీరీస్ లకు విపరీతమైన పాజిటీవ్ రెస్పాన్స్ లభించింది. నా రోల్స్ రెండు సీరీస్ లో డిఫరెంట్ గా ఉన్నాయని రివ్యూస్ లో చూస్తుంటే సంతోషంగా ఉంది. మీ అందరి సపోర్ట్ తో భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపారు.

Related posts