telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్ కొత్త టెస్ట్ కెప్టెన్ గా బాబర్…

బాబర్ ఆజమ్ పాకిస్థాన్ కొత్త టెట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత కెప్టెన్ అజార్ అలీ స్థానంలో ఈ పొడవైన ఫార్మాట్‌లో బాబర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి ప్రకటించారు. అలాగే అజార్ అలీ టెస్ట్ జట్టులో ఆటగాడిగా కొనసాగుతాడని తెలిపారు. ఇప్పటికే పాకిస్థాన్ పరిమిత ఓవర్ల ఫార్మట్స్ లో కెప్టెన్ గా వ్యవరిస్తున బాబర్ ఇప్పుడు 3 ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం క్రికెట్ లోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు బాబర్ ఆజమ్. పాక్ తాజాగా జింబాబ్వే తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో పాల్గొని… దానిని క్లిన్ స్వీప్ చేసిన కొద్ది సమయానికే పాక్ బోర్డు బాబర్ ను టెస్ట్ కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. దాంతో డిసెంబర్ 26 నుండి జనవరి 7 వరకు న్యూజిలాండ్‌లో జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగబోయే టెస్ట్ సిరీస్‌లో బాబర్ పాకిస్థాన్ ‌కు నాయకత్వం వహించనున్నాడు.

బాబర్‌ కు టెస్ట్ కెప్టెన్సీగా అప్పగించడానికి క్రికెట్ బోర్డు ఇదే సరైన సమయం అని పిసిబి చైర్మన్ మణి అన్నారు. “బాబర్ అజామ్ చాలా చిన్న వయస్సులోనే భవిష్యత్ నాయకుడిగా గుర్తించబడ్డాడు మరియు అతని పురోగతి మరియు అభివృద్ధిలో భాగంగా, అతను గత సంవత్సరం వైట్-బాల్ కెప్టెన్గా నియమించబడ్డాడు. తన స్థిరమైన పనితీరు మరియు నాయకత్వ నైపుణ్యాలతో, కెప్టెన్ యొక్క అదనపు బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నిరూపించాడు” అని తెలిపాడు.

Related posts