telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వలసయాత్ర…

కూడు లేదు
కొంపా లేదు
ఆకలైతే ఆదరించే
నాధుడు లేడు
పదరా ముందుకు
పిల్లా పాపలతో
వలస యాత్రా
జీవించు సోదరా!
సాగించు సంచార
సంసార యాత్ర
శోధించి సాధించు
జీవన గమనము
మూటా ముల్లే
తలపై పెట్టుకొని
సాగరా ముందుకు
జీవన సమరం చేస్తూ
సాగించరా ఆపక
వలస యాత్ర
అలుపు లేని
జీవన యాత్ర
పొద్దు పడమరకు
మరలే సంజ వెలుగులు
వెలుగులు విరజిమ్మగ
చీకట్లనే కష్టాలు తరలి పోవ
అన్ని ఊర్లు మనవే
నోరు మంచిదైతే
ఊరు మంచిదే
సాగించు నీ పయనం
నీ వారితో బ్రతుకు
భయం మరచి
సాధన చేస్తూ సంసార
మనే నావలో పయనించు

Related posts