ప్రముఖ తమిళ హీరో విశాల్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ ఆయన తండ్రి, నిర్మాత జికే రెడ్డి ఇటీవలే ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అనీషాను విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే విశాల్ భార్య ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొనగా… ఈ అమ్మాయే విశాల్ భార్య అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా అనిషా ఆ వార్తలకు తెరదించుతూ సంక్రాంతి స్పెషల్ గా విశాల్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలుపుతూ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకుముందు అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించిన అనీషా ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Congrats to @VishalKOfficial to who is getting married to Hyderabad girl #Anisha soon. pic.twitter.com/Zf0Zqph6pl
— BARaju (@baraju_SuperHit) January 16, 2019