telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ లో జాయినైన “టక్ జగదీష్”

Tuck-Jagadish

నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఐదు నెలలపాటు తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్‌లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ‘టక్ జగదీష్’ చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. “జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను కూడా నాని ట్వీట్‌లో పొందుపరిచారు. ఈ విషయాన్ని ‘టక్ జగదీష్’ చిత్ర యూనిట్‌తో పాటు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Related posts