telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

స్వైన్ ఫ్లూ విజృంభణ… రెండు రోజులలో 9 ప్రాణాలు..

swine flu deaths raised to 11

స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభిస్తుంది. వాతావరణం ఇంకా చలిగానే ఉంటుండటంతో దీని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో కూడా స్వైన్‌ఫ్లూ తన ప్రతాపం చూపించడం మొదలెట్టింది. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 100 కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో గడిచిన 48 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజస్థాన్‌లోనే 100 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందారు. ఈ క్రమంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలకు అక్కడి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే.. రాజస్థాన్ నుంచి 2,793 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని వారికి ముందస్తుగా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తగిన సూచనలు ఇస్తున్నారు.

Related posts