తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి టీ-సేవ ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు టీ-సేవ సంస్థ డైరెక్టర్ ఆడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కాచిగూడలో మీడియాతో మాట్లాడుతూ.. బస్సు, రైలు, విమానాల టికెట్‌ల బుకింగ్, కొత్త పాన్‌కార్డు, మార్పులు, వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, పలు రకాల వస్తువుల విక్రయాలు, కొనుగోళ్లతోపాటు అనేకరకాల సేవలను ప్రజలవద్దకే తెస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆసక్తిగల యువత ఈనెల 21 లోపు సంప్రదించాలని కోరారు.
వివరాలకు ఫోన్‌నం: 8179955744, లేదా www.tsevacentre.com సంప్రదించవచ్చని తెలిపారు.
మునుగోడు ప్రచారానికి వెళ్లను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు