telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రొమాంటిక్ సాంగ్ తో అదరగొడుతున్న ఐఏఎస్ అధికారి

Dil

“చార్ పంద్రా” షార్ట్ ఫిలింలోని ప్రముఖ సింగర్‌ బి ప్రాక్ పాడిన ‘దిల్ తోడ్‌ కే’ పాట ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటి వరకు ఆ పాటకు 25 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ షార్ట్ ఫిలింలో ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ నటనకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ పాటలో అభిషేక్ సింగ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ రొమాంటిక్ సాంగ్ లో అభిషేక్ ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ షార్ట్ ఫిలింను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ దిగ్గజం టీ సిరీస్‌ రూపొందించింది. ఇక అభిషేక్ సింగ్ వెండి తెరపై కూడా కనిపించటం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అభిషేక్‌ “ఢిల్లీ క్రైం-2” అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Related posts