telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసులో కీలకంగా డైరీ… మరో కొత్త కోణం

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు విషయమై ముంబై పోలీసులతో పాటు సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగడంతో రకరకాల కోణాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియాను కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేపడుతుండగా.. తాజాగా సుశాంత్ రాసుకున్న డైరీలోని కొన్ని కీలక విషయాలు రివీల్ కావడం ఈ కేసును మరో మలుపు తిప్పుతోంది. సుశాంత్ సొంత చేతిరాతతో రాసుకున్న డైరీ, అందులో ఆయన రాసుకున్న అంశాలు తాజాగా తెరపైకి వచ్చాయి. దీని ప్రకారం 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు సుశాంత్. అందుకు తగ్గట్లుగా ఆయన ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ డైరీ రాసుకున్నాడు. ఏప్రిల్ 27, 2018 నాటి నోట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన దినచర్య రాసుకున్నాడు. కొన్ని వేద శ్లోకాలను పఠించానని, అలాగే ఇకపై స్మోకింగ్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నాడు. మరో పేజీలో సమస్యలను ఎలా పరిష్కరించాలి? అనే కోణంలో కొన్ని సూక్తులు రాసుకున్నాడు. అలాగే అనుభవం, విశ్లేషణ, ఆనందం, ధైర్యం, బ్రిలియెన్స్, డివైన్ అనే పదాలను కూడా రాసుకున్నాడు. నీతి ఆయోగ్ విధానాలు, నాసా, విద్యావిధానం, మేధావులు, అక్షరాస్యులు, వివిధ రకాల సాహిత్యాలు మొదలైన అంశాలు నోట్ చేశాడు. ఇంకా ఇందులో తన ఆనందం, డిప్రెషన్, పర్సనల్ విషయాలు అన్నీ కూడా ప్రస్తావించాడని తెలుస్తోంది. దీంతో సీబీఐ విచారణలో ఇదే కీలకం కానుందనే టాక్ నడుస్తోంది. ఇన్ని రాసుకున్న సుశాంత్ మరి సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదనేది పలు అనుమానాలు లేవనెత్తుతోంది. ఇక ఇంకెన్ని ఈ డెత్ మిస్టరీ కొనసాగుతుందో చూడాలి. మూడు నెలలు గడిచిపోయినా ఇంకా మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Related posts