telugu navyamedia
సినిమా వార్తలు

ఆమెతో సినిమా చేసే ప్రసక్తే లేదు.

తనకు కూతురిగా నటించిన కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అన్నారు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో కంటే విజయ్ సేతుపతికి క్రేజ్ మాములుగా లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి కృతిశెట్టికి తండ్రిగా రాయణం పాత్ర పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు.

Despite the clichés, Bucchi Babu Sana's 'Uppena' (Panja Vaisshnav Tej, Krithi Shetty, Vijay Sethupathi) does interesting things in the 'masala' space | Baradwaj Rangan

తాజాగా ఆయన నటించిన లాభం’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమాలో తనకు జోడీగా కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. ఉప్పెన’ చిత్రంలో బేబమ్మ పాత్రకు తండిగ్రా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఆ సినిమా తర్వాత తమిళంలో చేయబోయే చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని సెలెక్ట్‌ చేస్తే బావుంటుందని దర్శకనిర్మాతలు భావించి ఆమె ఫొటో పంపారు. వెంటనే వారికి కాల్‌ చేసి ఇటీవల ఓ సినిమాలో ఆమెకు తండ్రి నటించాను. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్‌ చేయలేను. తనని నా పక్కన హీరోయిన్‌గా ఊహించుకోలేను’’ అని చెప్పా.

Krithi Shetty Fan Photos | Krithi Shetty Pictures, Images - 73697 - FilmiBeat

‘ఉప్పెన’ క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎమోషనల్‌ సీన్స్‌ చేయడానికి కాస్త కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసు ఉన్న కొడుగు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి. భయపడకు కంగారు లేకుండా ధైర్యంగా చెయ్య’ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన కృతీతో జోడీ కట్టడం నా వల్ల కాదు’’ అని విజయ్ సేతుపతి వివరించారు. ఆయన నటించిన ‘లాభం’ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Related posts