ఇన్ని రోజులు తెలుగు ప్రేక్షకులకు అలరించిన బిగ్‌బాస్ 5వ సీజన్ నేటితో ముగుస్తుంది. దాదాపు 106 రోజుల ప్రయాణం తరువాత బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఇవాళ్టి ఎపిసోడ్ తో ఈ రియాల్టీ షో కు తెరపడనుంది.
అయితే ఈ రోజు వచ్చే బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్స్‌లో వి జె సన్నీ, శ్రీ రామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి లు చేరారు.
అయితే వీరిలో ఈ సీజన్ విన్నర్ ఎవరు? టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారు? అలాగే ఈ ఫైనల్స్ కి గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఓటింగ్ ప్రకారం చూస్తే.. 34 శాతం ఓట్లతో విజే సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో షణ్ముఖ్ 31 ఓట్లు, శ్రీ రామచంద్ర 20 ఓట్లు, మానస్ ఎనిమిది ఓట్లు, సిరి ఏడు ఓట్లతో ఉన్నారు. అంటే ఈ లెక్కన బిగ్ బాస్ టైటిల్ విజేత గా వీ జే సన్నీ నిలిచినట్టు తెలుస్తోంది.
ఇకపోతే నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” యూనిట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది కన్ఫర్మ్ కాగా వీరు షో మధ్యలో ముచ్చటించడానికి వచ్చారా లేక విన్నింగ్ కంటెస్టంట్ ని అనౌన్స్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోపక్క RRR యూనిట్ కూడా వస్తారని గాసిప్స్ ఉన్నాయి కానీ దీనిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి మాత్రం ఈ గ్రాండ్ ఎపిసోడ్ ని చూడటానికి చాలా మందే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బిగ్‌బాస్ 5వ సీజన్‌లో ఎవరు విజేతగా నిలవనున్నారో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..