telugu navyamedia
సినిమా వార్తలు

థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోన్న ‘పుష్ప’..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క‌న్నడ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన చిత్రం పుష్ప‌. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన‌ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.

Pushpa' Box Office Collection Day 1: Allu Arjun starrer makes a solid  opening in Tamil Nadu | Tamil Movie News - Times of India

ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్‌17)న విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లతో దూసుకుపోతుంది.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ పుష్ప రికార్డ్స్ సృష్టిస్తోంది.

Recrd pre-release business for Pushpa | Manacinema

ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Saami Saami: Third single from Pushpa shows Allu Arjun, Rashmika Mandanna  in rural get up

ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని మేకర్స్‌ తెలిపారు.

Karnataka calls for boycotting Allu Arjun's film Pushpa The Rise: Part 1-  Cinema express

కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా సెకండ్ పార్ట్‏కు పుష్ప ది రూల్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చేయనున్నట్లు సామారం. పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

Related posts