telugu navyamedia
సామాజిక

వెనిగళ్ల కోమల అమెరికా జ్ఞాపకాలు ..

వెనిగళ్ళ కోమలగారు ప్రముఖ హేతువాది, మానవవాది, రచయిత, పాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్యగారి సతీమణి .ఆమె డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేశారు,
కోమలగారు చాలాకాలం క్రితం పదవీ విరమణ చేశారు .
కోమల గారు మతపంజరంలో కన్య, (,అయాన్ హిర్సీఅలీ – నోమాడ్, కేజ్డ్ వర్జిన్మ)
అడవికాచిన వెన్నెల , చైనా వనితల కష్టాలు ( యంగ్ ఛాంగ్ – వైల్డ్ స్వాన్స్ )
పిల్లి ఆత్మకథ ( ఎమ్.ఎన్.రాయ్ – మెమోయిర్స్ ఆఫ్ కాట్ )
కాళరాత్రి (ఎలీవీజల్ – నై ) మొదలైన అనువాదాలను
స్వీయచరిత్రను తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు.
ఆమె దిన, వారపత్రికలకి అనేక వ్యాసాలు రాశారు.
2010లో అమెరికా వెళ్ళిపోయిన కోమలగారు ఇటీవల చనిపోయారు

1992లో నేను నా భర్త నరిసెట్టి ఇన్నయ్యగారితో మొదటిసారి అమెరికాలో అడుగుపెట్టాను . అబ్బాయి రాజు, అమ్మాయి నవీనలతో చక్కగా గడిపాము .

తొలి పర్యటనలోనే రాజు ఉద్యోగం చేస్తున్న డేటన్ దర్శించాము రు. అప్పుడు డేటన్ డైలీ న్యూస్ దినపత్రికలో రాజు పనిచేస్తున్నాడు . డేటన్ లో ప్రతి సంవత్సరం జరిగే విమానాల విన్యాస ప్రదర్శనకు మమ్మల్ని తీసుకెళ్లాడు . అవి చూసి పులకించాము . .

డేటన్ నగరం ఇన్నయ్యగారితో కలిసి సందర్శించాను . .
డేటన్ లో మూడు నదులు ప్రవహిస్తాయి. అందులో ఒక నది పేరు – మాడ్ (పిచ్చి) రివర్! ఆ నది ఒడ్డున సనాతన గ్రీక్ చర్చి ఉంది. అది చారిత్రకప్రసిద్ధమైనది. దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆచర్చి నిర్వాహకులు తొలిసారి వచ్చినందుకు చక్కగా స్వాగతించి, అంతా తిప్పి చూపించి, అల్పాహారం కూడా ఇచ్చారు.

డేటన్ చిన్న నగరం. కాలినడకనే డేటన్ అంతా తిరిగి చూశాము . . అప్పుడు జంపాల చౌదరిగారు అక్కడ పనిచేస్తుండేవారు. ఆయన, మరో ఇద్దరు మిత్రులు శ్రీనివాస్, మురళి మాకు పరిచయం అయ్యారు.

డేటన్ లో రాజు వద్ద నాలుగు రోజులు గడిపాక, అక్కడ నుంచి అమ్మాయి డాక్టర్ కుమార్తె నవీన వుండే మేరీలాండ్ కి వచ్చాము .

అలా మొదటి పర్యటనసారి అమెరికా సందర్శించిన జ్ఞాపకాలు ఇంకా మనస్సులో మెదులుతూనే వున్నాయి .

Related posts