telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

యాంత్రిక జీవితంలో .. ‘ఓం’కారం ప్రాధాన్యత..

OM chanting importance in these days

యాంత్రిక జీవితంలో కూడా ‘ఓం’కారానికి చాలా ప్రాధాన్యత ఉందని, అది అవసరం అని కూడా అంటున్నారు ప్రస్తుత వైజ్ఞానికులు. తాజాగా వారు చేసిన పరిశోధనలలో దాని ప్రాముఖ్యతను వారు నిరూపించారు. ముఖ్యంగా హిందూ జీవన విధానంతో ఓంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. వేదాల్లో, భగవద్గీతలో, యోగాలో .. ఇలా ఎక్కడ చూసినా ఓంకారం కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ముందు ఓం రాయడం చాలా మందికి అలవాటు. కానీ ఓంకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో పరిశీలిద్దాం..

‘ఓం’ శబ్దంపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. ఆ శబ్దం పలికినప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ ఎక్కువగా ఉత్తేజితమవుతుందట. ఓం పలకడంవల్ల మెదడులోని కార్టెక్స్‌ ముందుభాగం ఉత్తేజితమవుతుందని అధ్యయనంలో తేలింది. ఓం పఠించడం వల్ల మెదడులో భావనియంత్రణ వ్యవస్థపై ప్రభావం పడిందని శాస్తవేత్తలు శాస్త్రీయంగా రుజువు చేశారు కూడా. అయితే ఓం శబ్దాన్ని పఠించేటప్పుడు .. ఇది మనలో మార్పు తెస్తుందన్న నమ్మకంతో పలకాలి లేకపోతే .. ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఆ అధ్యయనాలు రుజువు చేశాయి .

ఓం శబ్దం వల్ల నాడీవ్యవస్థలో, మానసికపరమైన, రసాయనికంగా ఎటువంటి మార్పులు కలిగాయో తెలుసుకోవడం ద్వారా మానసిక రోగాలను నయం చేయవచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఫలితాలను .. ఓం పలికినప్పుడు మెదడులో కలిగే మార్పులను … ఎమ్‌ఆర్‌ఐ, మెదడుకు సంబంధించిన ఇతర చిత్రాల ద్వారా కూడా రుజువు చేశారు. అందుకే మానిసిక ప్రశాంతత కోసం ‘ఓం’ దివ్య మంత్రమని ఈ తరం వైజ్ఞానికులు కూడా ఒప్పుకుంటున్నారు.

Related posts