telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వాషింగ్ మెషీన్ లో ఐదేళ్ల బాలుడు… తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు

Indiana

ఒంటిపై గాయాలతో ఉన్న ఐదేళ్ల కుమారుడిని తండ్రి ఆసుపత్రిలో చేర్చాడు. రన్నింగ్‌లో ఉన్న వాషింగ్‌మెషీన్‌ లోపల ఇరుక్కుపోవడం వల్లే తన కొడుకుకు గాయాలైనట్టు డాక్టర్లకు తండ్రి చెప్పాడు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై తండ్రిని విచారించగా.. ఘటన జరిగిన సమయంలో తన భార్య హీథర్ ఆలివర్(30) ఇంట్లోనే ఉన్నట్టు వివరించాడు. తాను ఏ తప్పు చేయలేదని.. తమ కొడుకు వాషింగ్‌మెషీన్‌లోకి ఎలా వెళ్లాడో తనకు తెలియదని హీథర్ పోలీసులకు తెలిపింది. అధికారులు వాషింగ్‌మెషీన్ సంస్థను సంప్రదించగా.. వాషింగ్‌మెషీన్‌లోకి బాలుడు నేరుగా వెళ్లే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దీంతో కన్నతల్లే బాలుడిని వాషింగ్‌మెషీన్‌లో వేసినట్టు నిర్థారించుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Related posts