telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు..కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

uttam congress mp

ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…భాదితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని…గ్రేటర్లో వంద రోజుల ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు. .కేసీఆర్ హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

ముందు వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోండని…మౌలిక వసతులు కల్పించకపోవడంమే నగరంలో దుస్థితికి కారణమన్నారు. వరదల మరణాలను కూడా తక్కువ చేసి చూపుతున్నారని…ఓ వైపు వర్షాలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే కేసీఆర్ హర్టీ కల్చర్ మీద రివ్యూ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. మూడు రోజులవుతున్నా ఇండ్లలో నీటిని తోడేసే ఏర్పాట్లు చేయలేదని…కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయడం లేదన్నారు. బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని..కాంగ్రెస్ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Related posts