telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ “అరుంధతి”గా కరీనా ?

Arundhathi

అనుష్క గతంలో నటించిన “అరుంధతి” చిత్రం త్వరలో హిందీలోకి రీమేక్ కాబోతోందట. నిజానికి తెలుగులో విడుదలై సంచలన విజయంగా నిలిచిన వెంటనే ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలనుకున్నారు. రీమేక్ రైట్స్ కూడా అప్పట్లోనే ఓ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. అయితే పలు కారణాల వల్ల ఇప్పటివరకు రీమేక్ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను పట్టాలెక్కించాలనే ప్రయత్నం జరుగుతోందట. ఈ సినిమాలో జేజమ్మగా కరీనా కపూర్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. కరీనా ఈ పాత్రకు సరిగ్గా సరిపోతోందని భావిస్తున్నారట. ఒకవేళ కరీనా కాదంటే అనుష్క శర్మను సంప్రదించాలనుకుంటున్నారట. మరి బాలీవుడ్ “అరుంధతి”గా ఎవరు కన్పిస్తారో చూడాలి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. కొన్ని సినిమాలు నేరుగా హిందీలో విడుదలవుతుంటే.. మరికొన్ని రీమేక్ అవుతున్నాయి. మరోవైపు యూట్యూబ్‌లోనూ తెలుగు సినిమాల హిందీ వెర్షన్లు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ మేకర్ల ద‌ృష్టి ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది.

Related posts