telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

39 ఏళ్ళలో ఇలా ఎప్పుడూ చూడలేదు : రేణూదేశాయ్

Renu-Desai

రేణుదేశాయ్ హైదరాబాద్‌ వాతావరణంపై తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.”ఇది బ్లాక్ అండ్ వైట్ ఫొటో కాదు.. నిన్న సాయంత్రం క్లిక్ చేసిన కలర్ ఫొటో. నా 39 ఏళ్ళ జీవితంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. ఆకాశం ఎంతో వాస్తవికమైనదిగా.. సినిమాలో చూపించినట్టుగానే అనిపించింది. ఈ ఫొటోని సాయంత్రం 6 గంటలకు తీయడం జరిగింది. దీనిని ఎలాంటి ఎడిట్‌ చేయలేదు. ఆకాశం తనను తానే అందంగా ముస్తాబు చేసుకుంది..” అని తెలుపుతూ ఈ పిక్‌ని తన ఐఫోన్ నుంచి తీసినట్లుగా పేర్కొన్నారు రేణు దేశాయ్. బుధవారం సాయంత్రం కూడా భాగ్యనగరంలో కారుమబ్బులు పట్టి భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ స్వయంగా తాను తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన రహదారులతో పాటు అనేక లోతట్టు ప్రాంతాల్లో నీరుచేరి జనజీవనానికి ఆటంకం కలుగుతోంది.

Related posts