ఇటీవల కాలంలో తమకన్నా తక్కువ వయసున్న అబ్బాయిలను ప్రేమించడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, మలైకా అరోరా చేరిపోయారు. తాజాగా హెలెనా బోన్హామ్ అనే 53 ఏళ్ల హాలీవుడ్ నటి తన కంటే 21 ఏళ్ల చిన్నవయసు కలిగిన వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తూ హాట్ టాపిక్ గా మారింది. హెలెనాకు ఇది వరకే దర్శకుడు టిమ బర్టన్‌తో పెళ్లైంది. అతనితో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలై విడిపోయారు. ఇప్పుడు హెలెనా తన కంటే 21 ఏళ్లు చిన్నవాడైన రైటర్ రై హోమ్‌బోతో డేటింగ్‌లో ఉంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ “అవును నా బాయ్‌ఫ్రెండ్ నాకంటే 21 ఏళ్లు చిన్నవాడు. అయితే ఏంటి? నాకు వయసు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అలాంటప్పుడు ప్రేమించుకుంటే తప్పేంటి? నా ప్రియుడు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాడు. అతని వయసు చిన్నదే అయినా ఆలోచనా విధానం మాత్రం పెద్దవారిలా ఉంటుంది. నాకు అంతకంటే ఇంకేం కావాలి. చాలా మంది ముసలివాళ్లను చూస్తే భయపడుతుంటారు. కానీ నా బాయ్‌ఫ్రెండ్ అలా కాదు. ముసలివాళ్లయ్యాక ఆడవాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా తయారు అవుతారు. మాలాంటి వారితో డేటింగ్ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది. ఇప్పుడు మేం పిల్లల్ని కనలేం. అంతమాత్రాన మేం ఈ వయసులో రొమాంటిక్‌గా ఉండమని కాదు. మేం సెక్స్‌ను ఈవయసులోనూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు మాకు గర్భం వస్తుందేమోనన్న భయం కూడా ఉండదు. కాబట్టి ఫన్ కోసం మరొకరితో డేటింగ్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు” అని నిర్మొహమాటంగా చెప్పింది.
previous post