విధుల్లో ఉన్న ఓ మహిళ తహశీల్దార్ ను పట్టపగలు ఓ దుండగుడు సజీవ దహనం చేయడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి అగ్నికి ఆహుతి చేశాడు. అనంతరం సురేశ్ కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ ఘటన పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన, తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.