telugu navyamedia
సినిమా వార్తలు

నువ్వు పెడితే విషం కూడా తాగుతా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా నటించిన ఆర్ ఆర్ ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తుంది.

తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ముగ్గురు కలిసి కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను స్ట్రీమింగ్ చేశారు మేకర్స్. ఇందులో వీరు ముగ్గురు పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుకున్నారు.

RRR Off The Record Interview: Rajamouli Funny Comments On Jr NTR - Sakshi

ఈ క్రమంలో తారక్‌, చరణ్‌, జక్కన్న చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెగ్యులర్‌ ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా చాలా సరదాగా, ఫన్నీగా సాగింది ఈ ఇంటర్వ్యూ. ఎవరెవరు ఎలాంటి డ్రెస్‌ వేసుకోవాలి అన్న దగ్గరి నుంచి ఏఏ ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్స్‌ చేయాలన్న వివరాలను ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకున్నారు.

వీడియో మొదట్లో ‘నాకు నిద్రొస్తుంది కాపీ పెడతాను. మీకు ఏమైనా కావాలా’ అని చరణ్‌ అడగ్గా.. ‘నువ్వు పెడితే విషం కూడా తాగుతా’ అంటూ తారక్‌ బదులిచ్చాడు. దీంతో రాజమౌళి ఎంటర్‌ అయ్యి.. అయితే రెండు చుక్కల విషం కలిపి ఇచ్చెయ్‌ అంటూ కౌంటర్‌ వేశాడు.

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మొదటిరోజు థియేటర్లో సినిమా చూడాలని ఉంది. దీనికి రాజమౌళి ఓ సలహా ఇచ్చారు. ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఉంటారు కాబట్టి వెళ్లడం కష్టమని.. కాబట్టి ముందు రోజు రాత్రి అందరికంటే ముందు థియేటర్ కి వెళ్లి అక్కడే పడుకోవాలని చెప్పారు రాజమౌళి.

దీనికి బదులుగా.. కార్తికేయ తనకు ఓ సలహా ఇచ్చాడని రామ్ చరణ్ అన్నారు. ప్రొస్థెటిక్ మేకప్ వేసుకొని సినిమాకి వెళ్తే బెటర్ అని చెప్పినట్లు రామ్ చరణ్ తెలిపారు. అది కూడా మంచి ఐడియా అని రాజమౌళి అన్నారు. ఇదివరకు రజినీకాంత్ ఆయన సినిమాలను థియేటర్లలో అలానే ప్రొస్థెటిక్ మేకప్ వేసుకొని చూసేవారని రామ్ చరణ్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts