telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరో నా స్కర్టులో చేయి పెట్టి… స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

Harris

గతేడాది అక్టోబర్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా… బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో మీటూ ఉద్యమానికి తెరలేపింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు తమను వేధించిన దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బయటపెట్టారు. ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై ఆరోపణలు గుప్పించడంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తాజాగా బ్రిటీష్ నటి నవోమి హారీస్‌ తనకు ఎదురైన చేదు అనుభవాల్నీ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ.. తనకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని.. అందులో భాగంగా వేశాల కోసం పలు చోట్ల ఆడిషన్స్‌కు వెళ్లాదాన్నని తెలిపింది. అయితే ఓ రోజు ఓ స్టార్‌ హీరో సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లానని.. ఆ ఆడిషన్‌లో కాస్టింగ్ డైరెక్టర్‌, సినిమా డైరెక్టర్, ఆ సినిమాలో నటించనున్న స్టార్ హీరో ఉన్నాడని.. అయితే ఆడిషన్స్ కోసం అక్కడి వెళ్లిన నాతో ఆ స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కోంది. ఆ స్టార్ హీరో నాతో మాట్లాడుతూ.. నా స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యకరంగా టచ్‌ చేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో భయంతో వణికి పోయానని తెలిపింది. కాగా హీరో అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. అక్కడ ఉన్నవారు ఎవరూ ఏమి అనలేదని.. ఒక్కరూ ఓ మాట మాట్లాడలేదని.. అలాగే చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ భయంకర ఘటన తను జీవితంలో మర్చి పోలేనిదని పేర్కోంది. అయితే అప్పుడప్పుడే అవకాశాలు అందిపచ్చుకుంటున్న తాను ఆ ఘటన గురించి బయట ఎక్కడా చర్చించలేదని తెలిపింది. అంతేకాదు ఇప్పుడు కూడా అతని పేరును బయట పెట్టాలనే ఆలోచన లేదని పేర్కోంది. నవోమి హారిస్ ప్రస్తుతం జేమ్స్ బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2020 ఎప్రిల్ 3 న విడుదల కానుంది.

Related posts