telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీట్ వివాదం… సూర్యకు హైకోర్టు హితవు

Surya

కరోనా కారణంగా భయం, ఒత్తిడితో తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా కాలంలో నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న వైనం, కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని గతంలో కూడా తప్పుబట్టిన సూర్య ఈ ఘటనలపై ఘాటుగా స్పందించారు. సోషల్‌ మీడియాలో సూర్య చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దీంతో సూర్యపై హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యపై కోర్టు ధిక్కార‌ణ చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు, సూర్య వ్యాఖ్యలు అనవసరమైనవని, ఆమోదయోగ్యం కాదని తెలియజేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సుకు న్యాయవ్యవస్థ పని చేస్తుంది. ఇలాంటి సమయంలో వ్యవస్థను తక్కువ చేసిన మాట్లాడటం తగదని కోర్టు పేర్కొంది.

Related posts