telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియన్ రైల్వేస్ కొత్త రికార్డు…

మన దేశంలో కరోనా చాలా రంగాలను దెబ్బ తీసింది. అందులో రైల్వే సర్వీసులు కూడా ఉన్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాది రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి.. ప్రత్యేక సర్వీసులు తప్ప.. రెగ్యులర్ సర్వీసులు పట్టాలు ఎక్కడానికి చాలా సమయమే పట్టింది.. ఇప్పటికీ కొన్ని రైల్వే సర్వీసులు ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కానీ, ఇదే సమయంలో.. గత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డును సృష్టించింది ఇండియన్ రైల్వేస్.. ఒకే ఏడాదిలో అత్యధిక కిలోమీట‌ర్లు లైన్లను విద్యుదీక‌రించిన రికార్డును సొంతం చేసుకుంది భారత రైల్వే.. 2018-19లో 5,276 కిలోమీట‌ర్లతో రికార్డు ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. 2020-21 ఏడాదిలోనే రైల్వేస్ ఏకంగా 6015.. కిలోమీట‌ర్ల సెక్షన్లను విద్యుదీక‌రించినట్టు ప్రకటించింది. మొత్తం 64,689 కిలోమీట‌ర్ల రైల్వేలైన్ ఉండగా.. అందులో ఈ మార్చి 31వ తేదీ వరకు 45,881 కిలోమీట‌ర్లలో విద్యుదీక‌ర‌ణ పూర్తిచేసినట్టు.. ఇది మొత్తం 71 శాతం కావ‌డం వివేషంగా వెల్లడించింది రైల్వేశాఖ.

Related posts