telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఫలితాల వేళ .. కాంగ్రెస్ కూటమి సమావేశం.. ఈసారి స్వయంగా సోనియానే..

sonia and rahul appeal to court on case

అధికారం చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహాగత్‌బంధన్ కూటమి చకచకా పావులు కదుపుతోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల తరహా ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది. 19న చివరిదశ పోలింగ్ అనంతరం 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 23నే మహాగత్‌బంధన్ కూటమి సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ విషయమై ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతో సోనియా మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు కూటమి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారు. సమయం ఏమాత్రం వృథా కానివ్వకుండా సోనియా ప్రతిపక్షాలన్నింటినీ సిద్ధం చేస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

Related posts