telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తాత్కాలిక సారధిగా కూడా.. ఎంతో ఆస్వాదిస్తున్నా… : రోహిత్ శర్మ

kohli interviewed rohith sharma viral

భారతజట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని… అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. కోహ్లికి టీ20 ఫార్మాట్‌లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్‌ ఓపెనర్‌ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాదేశ్ తో T20ల కోసం పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకెప్టెన్‌గా 1మ్యాచ్ అయినా 100మ్యాచ్ లు అయినా జట్టును లీడ్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తానన్నారు.

ముణ్నాళ్ల ముచ్చటైనా… తనకెలాంటి బాధలేదని చెప్పాడు. వన్టే క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులోకి తనను లాగొద్దని… జట్టుకు అవసరమైన ప్రతీసారి నాయకత్వం వహించేందుకు సిద్ధమేనన్నాడు. కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదన్నాడు. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని రోహిత్ తెలిపాడు. కోహ్లీకి తన మద్దతు ఉంటుందని తెలిపాడు.

Related posts