telugu navyamedia
సినిమా వార్తలు

థియేటర్‌లోనే ‘రొమాంటిక్‌’

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. సొంత బ్యానర్ పై పూరి నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ పాదూరి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా పడింది. అయితే సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా “రొమాంటిక్” చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్ల ఇంటెన్స్ రొమాంటిక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Akash Puri latest update with Romantic poster

ఈ చిత్రంలో ఆకాష్ పూరీ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగు డెబ్యూ మూవీ. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Related posts