telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందని ఆరోపించారు.

నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ కాదు.. కేసీఆర్ సెల్ఫ్ గోల్ ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూర్‌నగర్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మండలి చైర్మన్‌ గుత్తా రాజకీయ ప్రలోభాలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Related posts