telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొండలపైకి ఎక్కి టెంట్లలో ప్రజల ఇబ్బందులు: దేవినేని

devineni on power supply

ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలాకు గా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శిబిరాలకు వస్తేనే సాయమని ప్రభుత్వం తెలుపడంతో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.

పిల్లలతో కొండలపైకి ఎక్కి టెంట్లలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడటంతో వందలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఏజెన్సీలో ఆకలి కేకలు. పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చి, వరద బాధితులను ఆదుకోవాలంటోన్న చంద్రబాబు మాటలు వినపడుతున్నాయా జగన్?’ అని దేవినేని ట్వీట్ చేశారు.

Related posts