telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం…

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్‌ను చూసినప్పుడల్లా సెహ్వాగ్‌ లెప్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఇంజీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పాత్ర పోషించిన పంత్ అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు. అయితే ఇంజమామ్ మాట్లాడుతూ… రిషబ్ పంత్‌ ఎలాంటి పరిస్థితిలోనైనా ఒత్తిడి ఫీల్‌ అవ్వడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆటగాడిని చూశాను. 6 వికెట్లు పడిన సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అద్భుతమైన ఇన్నిండ్స్‌ ఆడాడు. పిచ్‌ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. బౌలర్‌ ఎవరన్న విషయం గురించి ఆలోచించలేదు. స్పిన్నర్లైనా, ఫాస్ట్‌ బౌలర్లు అయినా తను ఒకే విధంగా ఆడాడు’ అని అన్నాడు.

Related posts