యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ‘తానాజీ’ దర్శకుడు ఔంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ తన 22వ చిత్రాన్ని చేయనున్నారు. ప్రభాస్ సినిమాకు “ఆదిపురుష్” అంటూ మంగళవారం ఉదయం ఈ చిత్ర టైటిల్‌ను పోస్టర్‌తో సహా విడుదల చేశారు. “చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగ చేసుకుందాం” అనేది క్యాప్షన్. ఈ పోస్టర్‌లో హనుమంతునితోపాటు ఎందరో మునులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది పౌరాణిక చిత్రమని ఈజీగా తెలుస్తోంది. త్రీడీలో రూపుదిద్దుకోనుండటం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. టీ సిరీస్ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు #Prabhas22, #Adipurush అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.
previous post