ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రముఖి ఆత్మ అంటూ చంద్రబాబుపై సైటైర్లు వేశారు. “రాజ్యాంగబద్ధ పదవి ముసుగులో ఆ ‘చంద్ర’ముఖి ఆత్మ రాష్ట్రంలో తిరుగుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. విధులను గాలికొదిలేసి రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతోంది. మరో రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది! గుళ్లు కూలగొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుంది. సడన్ గా నిలిచిపోయాయి. పంచాయతీల్లో కులాలు, మతాల మధ్య, పేదల మధ్య చిచ్చుపెట్టే అసైన్ మెంటు ఇచ్చి ఉంటాడు. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదు.” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
previous post