telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఉల్లాల ఉల్లాలా … ఫస్ట్ లుక్..

satyaprakash oolalla oolalla movie first look

సత్యప్రకాష్‌ డైరెక్టర్ గా ‘ఉల్లాల ఉల్లాలా’ పేరిట ఓ సినిమాను చేస్తున్నాడు. నటరాజ్‌, అంకిత, నూరిన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ విశేషాలు పంచుకున్నారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ విజయం పై దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

సత్యప్రకాష్‌ మాట్లాడుతూ భిన్న భాషల్లో ఐదు వందలకుపైగా సినిమాలు చేశాను. పోలీస్‌స్టోరీ, సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాలు నటుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దర్శకత్వం చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం థ్రిల్‌ను పంచుతుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా కథాగమనం సాగుతుందని తెలిపారు. సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఎ.గురురాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts