telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏక్తాకపూర్ కు పద్మశ్రీ… స్పందించిన లేడీ ప్రొడ్యూసర్

Ekta-Kapoor

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తున్న కేంద్రం ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో భాగంగానే ప్రొడ్యూసర్, టీవీ క్వీన్ ఏక్తా కపూర్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఏక్తాకపూర్ రూపొందించిన సీరియల్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఏక్తా కపూర్ ‘క్యోంకీ సాస్ బీ కభీ బహూ థీ’, ‘కహానీ ఘర్ ఘర్ కీ’… ఇలా మానవ సంబంధాలతో ముడిపడిన సీరియల్స్ రూపొందించారు. ఇప్పటివరకూ ఏక్తా కపూర్ 130కి పైగా టీవీ సీరియల్స్ రూపొందించారు. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఏక్తా కపూర్ సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేశారు. “తాను 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో కాలు మోపానని, అప్పట్లో తనను చిన్నదానివని అనేవారని పేర్కొన్నారు. తాను యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఉంటాను” అని’ తెలిపారు.

Related posts