పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్‌సాబ్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అఫిషీయల్‌గా ప్రకటించేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ అప్టేట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.