telugu navyamedia
క్రీడలు వార్తలు

రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టిన ఆ ఫోటో…

సింహం పిల్లతో టీమిండియా ఆల్ రౌండర్ దిగిన ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫోటోనే రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టింది. తనకు తెలియకుండానే కాంట్రవర్సీగా మారాడు టీమిండియా ఆల్ రౌండర్. ఇంతకీ ఏం జరిగిదంటే.. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్- ఐ కేటగీరి కింద కేటాయించబడిన జంతువులతో ఫోటోలు దిగరాదు. కానీ, రవీంద్ర జడేజా సింహం పిల్లతో దిగిన ఫోటోతో నేరం చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఫోటో గుజరాత్ సింహానికి సంబంధించినది కాదు.. ఆఫ్రికన్ లైన్ దని అటవీ అధికారులు తెలిపారు. అసలు రవీంద్ర ఈ వివాదంలో ఇరుక్కోవడానికి కారణం ఉంది. ఈ వివాదానికి రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో రాత్రి పూట మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాయ్. ఈ వీడియోను తీసిన జడేజా ట్విట్టర్ లో పంచుకున్నాడు. ” గొప్ప అనుభవం. ఈ రోడ్డు ట్రిప్ లో గొప్ప అనుభూతిని పొందాను ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు రవీంద్ర జడేజా. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, రవీంద్ర జడేజా ఈ వీడియో షేర్ చేసిన తర్వాత సింహాలు, వాటి పిల్లలతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో గుజరాత్ లైయన్స్ తో జడేజా దిగాడంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటవీ చట్టాల ప్రకారం గుజరాత్ సింహాలతో ఫోటోలు దిగడం నేరం. దీంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ” రవీంద్ర జడేజా ఫోటోల్ని పరిశీలించాం. అయితే, ఈ ఫోటోలు గుజరాత్ లోనివి కావు. కచ్చితంగా ఆఫ్రికా లైయన్స్ కు సంబంధించినవి ” అని అటవీ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

Related posts