telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మేడారం మినీ జాతరలో కరోనా కలకలం…

మేడారం మినీ జాతరలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధుల్లో ఉన్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడుతున్నారు. సహ ఉద్యోగులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. మహా జాతరకు వచ్చినట్టే చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారానికి భారీగా చేరుకుంటున్నారు. కాగా.. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఒక్కరు కరోనాతో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,98,631 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,95,059 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,633 మంది మృతిచెందారు. 

Related posts