telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేటినుండే రెండో డోస్ వ్యాక్సినేషన్…

corona vaccine covid-19

చైనా నుండి వచ్చి ఏడాదుకి పైగా ఇబ్బంది పెట్టిన కరోనా కు భారత్ లో వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొలి దశ వ్యాక్సనేషన్‌ తీసుకున్నవారికి నేటినుండే రెండో డోస్ ప్రారంభం అవుతుందని తెలిపారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్… హెల్త్ కేర్ వర్కర్లు, ఐసీడీఎస్‌ సిబ్బంది మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో.. రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని సూచించారు.. మొదటి డోస్ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని కీలక సూచనలు చేశారు. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేసుకోవాలన్నారు. ఇక, ఈ నెల 25వ తేదీలోగా హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వేసుకోవాలన్నారు.. ఈ నెల 25 తర్వాత వీరికి మొదటి డోస్ వేయరు.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25వ తేదీలోగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని సూచించిన భాస్కర్.. ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5 లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.. అటు తర్వాత వీరికి వ్యాక్సినేషన్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అయితే వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Related posts