30న ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని అధికారికంగా రాజభవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యి శాసనసభాపక్ష సమావేశ తీర్మానాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌కు జగన్ కోరారు. గవర్నర్‌తో జగన్ భేటీ అనంతరం ప్రమాణానికి రాజ్‌భవన్ ముహుర్తం ఖరారు చేసింది అధికారికంగా ప్రకటించింది.
వైఎస్ జగన్ వెంట సీనియర్ నేత, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిన జగన్ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ పలువురు మంత్రులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ప్రమాణస్వీకారోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్, విశాఖ, చెన్నై మార్గాల్లో వచ్చే వాహనాలు.. కృష్ణా జిల్లా శివారు ప్రాంతాల్లో నిలిపివేస్తారని తెలుస్తోంది. ఏఆర్ గ్రౌండ్స్‌లో వీఐపీల కోసం పార్కింగ్ కేటాయించారు. ప్రముఖుల వాహనాల కోసం బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పార్కింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఐదు రకాల ఎంట్రీ పాస్‌లు జారీ చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 35 వేల మందికి సీట్టింగ్ సామర్థ్యం ఉంది. వేసవి దృష్ట్యా స్టేడియంలో ఏసీలు, కూలర్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం వెలుపల ఎల్‌సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు