telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో ప్రారంభమైన నామినేషన్లు

AP Local Body Elections 2020 Reservation List Finalaized

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కొన్ని రోజులక్రితం వేటు వేసింది.  ఇది ఇలా ఉండగా… ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు మొదలైపోయాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగనుంది. మొదటి దశలో 3249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా… తొలిరోజు నామినేషన్ల పర్వం మొదలైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో ఉదయం 10.30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 31 సాయంత్రం 5 వరకు నామినేషనల స్వీకరణకు సమయం ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే… పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన జరుగుతుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో ఈ తొలిదశ పోరు జరుగనుంది.

Related posts