తమన్నాకు అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు తమిళ స్టార్ హీరో. ప్రస్తుతం తమన్నా తమిళంలో హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన “కన్నే కలైమానే” అనే సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమన్నాకు వీరాభిమాని అయిన ఓ వ్యక్తి పెళ్ళికి సంబంధించిన ప్రశ్న వేశాడు. “నువ్వంటే నాకు చాలా ఇష్టం… నన్ను పెళ్లి చేసుకుంటావా తమన్నా…?” అని ప్రశ్నించాడు.
ఆ అభిమానికి తమన్నా సమాధానం చెప్పేలోగా ఉదయనిధి స్టాలిన్ మధ్యలో మాట్లాడుతూ “అది ఎప్పటికీ జరగదు. తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు తెలియదా..?” అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా షాక్ అవ్వడం అక్కడున్న వారి వంతయ్యింది. చాలా రోజులుఆ తమన్నా పెళ్ళిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ తమన్నా మాత్రం స్పందించలేదు. ఇప్పుడు ఉదయనిధి ఇలా చెప్పడంతో అమెరికాలో తమన్నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.