telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో : 350 కోట్ల వసూళ్ళతో రికార్డు

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ప్రీమియర్స్ తో కలుపుకుని 130 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజునే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లోను కలుపుకుని 5 రోజుల్లో 350 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 400 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో “‘సాహో” దూకుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 500 కోట్ల మార్క్ ను టచ్ చేయడం “సాహో”కి పెద్ద కష్టం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం వినాయక చవితి సెలవు ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ మంగళవారం మాత్రం “సాహో” సినిమాకు అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 5వ రోజు కేవలం 4 లక్షల 63 వేల 8 వందల 96 రూపాయలు గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అక్కడ 6 థియేటర్స్‌లో “సాహో” విడుదలైతే.. ఇపుడు మాత్రం మూడు థియేటర్స్‌కే పరిమితమైంది. ఇక నైజాం లో మంగళవారం కోటి రూపాయల షేర్ తో 5 రోజుల్లో 24 కోట్ల షేర్ ను రాబట్టి బాహుబలి 1&2 తరువాత అల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక తమిళ, మలయాళ వెర్షన్ లు డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడగా ఓవర్సీస్ లో కూడా అదే ఫలితాన్ని కొనసాగించింది. 

Related posts