telugu navyamedia
సినిమా వార్తలు

యాత్ర : జగన్ పాత్రలో కన్పించబోయేది జగనే

10000 pension scheme announced by jagan
జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా “యాత్ర” పేరుతో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ “యాత్ర”. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే సందేహం మొదలైంది అభిమానుల్లో. 
జగన్ పాత్రకు కొంతమంది స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ… ఇప్పుడు మాత్రం జగన్ పాత్రలో స్వయంగా వైఎస్ జగనే కనిపిస్తాడని సమాచారం. అయితే జగన్ ఈ సినిమాలో నటించడం లేదు. మరి విషయమేంటంటే… ఈ సినిమాలో వైఎస్సార్ పాదయాత్ర, అధికారం చేప్పట్టడం వరకే చూపించబోతున్నారు. చివరిగా సినిమాలో వైఎస్ మరణం ఉంటుంది. అయితే చివరి ఇరవై నిమిషాలు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు తీసిన ఒరిజినల్ ఫుటేజ్ ని ఎడిట్ చేసి వెండి తెరపై చూపించబోతున్నారు. వైఎస్ అంతిమ సంస్కారాల సమయంలో జగన్ కనిపిస్తారు. 
ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ఈ వేడుకకి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా, విజయమ్మ, జగన్ భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం. రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో “ఆశ్రిత వేముగంటి” నటిస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఇంకా రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా “యాత్ర” చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న విడుదల చేస్తున్నారు.

Related posts