telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈవారం సమంత ఇంట్లో స్వయంగా పండించిన క్యారెట్ వంటకాలేనట…!

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని సమంత బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానంతో పాటు తన ఇంటిపై వ్యవసాయం చేస్తూ తనకు కావాల్సిన ఆహారాన్ని తనే స్వయంగా పండించుకుంటోంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత తన ఇంటిపై క్యారెట్‌లను పండించింది. ఇక ఈ వారమంతా క్యారెట్‌తోనే వంటలు చేయబోతోందట. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. “ఈ వారం మెనూ.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా” అని పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

The menu this week … Carrot juice , carrot pachadi , carrot halwa , carrot fry , carrot pakodi , carrot idli , carrot samosa 🤓 #growwithme

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts