telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవ్‌ స్టోరీ” టీజర్‌పై శేఖర్‌ కమ్ముల ఫుల్‌ హ్యపీ

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయింది. అయితే… తాజాగా ఈ టీజర్‌పై శేఖర్‌ కమ్ముల ట్విట్టర్‌ ద్వారా ఎమోషనల్‌ అయ్యాడు. ఈ టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తాము అనుకున్న కథకు సంబంధించిన పాత్రలు రివీల్‌ చేశామని.. ఆడియెన్స్‌ కనెక్ట్‌ అవ్వడం చాలా హ్యపీగా ఉందన్నారు. సినిమా కూడా కనెక్ట్‌ అవుతుందని హోప్‌ వచ్చిందని పేర్కొన్నారు. జనాలు కూడా 100 శాతం థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని… త్వరలోనే లవ్ స్టోరీని మీ ముందుకు తెస్తామని శేఖర్‌ కమ్ముల తెలిపారు.

Related posts